Kashayam – కషాయాలు తయారు:
పుల్లటి మజ్జగ: (శిలీంద్ర నాశిని (ఫంగిసైడ్)(అన్ని రకాల ఆకు మచ్చ, కాయ మచ్చ మరియు బూజు తెగులు నివారణ కొరకు).
ఎకరానికి కావలసిన పదార్థాలు: నీరు 1,000 లీటర్లు, పుల్లటి మజ్జిగ 6లీటర్లు
తయారు చేసే విధానం: ఎకరానికి 100 లీటర్ నీళ్లలో 6లీటర్ల పుల్లటి మజ్జిగ (3 రోజులు పులిసిన) మజ్జిగను కలిపి పంటకు పిచికారి చేయండి.
గమనిక: పుల్లటి మజ్జిగ బదులుగా రెండు లీటర్ల కొబ్బరినీళ్లు ఉపయోగించవచ్చు.
ఉపయోగించే విధానం: పుల్లటి మజ్జిగ అన్ని రకముల తెగుళ్ల నివారణకు ఉపయోగపడుతుంది. ముందు జాగ్రత్త చర్యగ పండు వేసిన 20 రోజులు ,45 రోజులకు రెండుసార్లు పంటపై పిచికారీ చేయాలి.
2. వావిలాకు కషాయం: వావిలాకు పంటలలో వచ్చే రసం పీల్చే పురుగులు పైన చిన్న దశలో ఉన్న పెద్ద పురుగు, శనగపచ్చ పురుగు పురుగు , ఆకులు తినే పురుగుల పై వాడవచ్చు. వావిలాకు లో కాస్ట్సిస్ అనే ఆల్కలాయిడ్ క్రిమిసంహారకంగా పని చేస్తాయి.
కావలసిన పదార్థాలు: వావిలాకు 5 కిలోలు, సబ్బు పొడి 100 గ్రాములు లేదా కుంకుడు కాయలు 500 గ్రాములు.
తయారు చేసే విధానం: వావిలాకు రద్దును 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్లు ఉంటుంది. కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రాముల సుబ్బు పొడి లేదా ఆఖరిలో కుంకుడుకాయలు రసాన్ని కలపాలి. పై ద్రావణాన్ని వంద లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం ఎలా పిచికారి చేయాలి.
Also Read: మొక్కజొన్న పంటలో జింకు లోపం లక్షణాలు మరియు యాజమాన్యం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వావిలాకు కషాయం తయారు చేసేటప్పుడు ముక్కుకు గుడ్డ వంటి పై పూర్తిగా బట్టలు ధరించాలి. పంట కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే అవసరాన్ని బట్టి పంటపై పిచికారీ చేయాలి. అలా కాకుండా ఎక్కువ సార్లు చేసినట్లయితే పంటలు ఉండే రైతు మిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. తయారుచేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి నిల్వ ఉంచరాదు.
ఉపయోగాలు: వావిలాకు కషాయం అన్ని పంటల్లో వచ్చే పురుగు నియంత్రణలో వాడవచ్చు. పంట తొలిదశలో (30 -45 రోజుల్లో ) సుమారు 100 లీటర్ల ద్రావణం ఒక ఎకరానికి సరిపోతుంది. పంట 60 నుండి 90 రోజుల మధ్య దశలో సుమారు 150 లీటర్ల ద్రావణం మరియు పంట చివరి దశలో( 90 120 రోజుల) సుమారు 200 లీటర్ల ద్రావణం ఎకరాకు అవసరం. వావిలాకు కషాయం వేరుశనగ లో వచ్చే తామర పురుగు, మిరప లో వచ్చే ఆకు ముడత, కూరగాయల పంటలు లో వచ్చే రసం పీల్చే పురుగు నియంత్రణలో పని చేస్తుంది. వావిలాకు కషాయం 10రోజుల వ్యవధిలో 2సార్లు పంటలపై పిచికారి చేయాల్సి వస్తుంది. పురుగుల తొలి దశలో వావిలాకు కషాయం బాగా పని చేస్తుంది.
3. అగ్ని అస్త్రం: (కాండం తొలుచు, కాయతొలుచు మరియు అన్ని రకాల తొలుచు పురుగులు కొరకు ఈ అగ్ని అస్త్రం ఉపయోగపడుతుంది).
కావలసిన పదార్థాలు:
ఆవు మూత్రం: 10-15 లీటర్లు, పొగాకు 1 కిలో, వెల్లుల్లి అరకిలో, పచ్చిమిర్చి 1కిలో, వేపాకులు 5కిలోలు.
తయారు చేసే విధానం: ఒక మట్టికుండలో పది లీటర్ల గోమూత్రం తీసుకొని అందులో ఒక కిలో పొగాకు ముద్ద 5 కిలోల ముద్ద కిలో పచ్చిమిర్చి మరియు అరకిలో వెల్లుల్లి ముద్ద వేసి మూత పెట్టి నాలుగు సార్లు వచ్చేటట్లుగా బాగా ఉడికించాలి. తర్వాత పాత్రను కిందకి దించి 48 గంటల వరకు చల్లారనివ్వాలి. చివరకు ఒక గుడ్డతో వడగట్టి ఒక డబ్బాలో వేసి ఉంచాలి. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2-3లీటర్ల అగ్ని అస్త్రం కలిపి పిచికారి చేయాలి. దీనిని మూడు నెలల వరకు ఉపయోగించవచ్చు.
4. బ్రహ్మాస్త్రం: ఒక పాత్రలో 10లీటర్ల గోమూత్రం తీసుకొని అందులో 2 కిలోల వేపాకు ముద్ద, 2కిలోల సీతాఫలం ఆకు ముద్ద 2 కిలోల, కానుగ ఆకులు 2కిలోల, ఉమ్మెత్త ఆకులు 2 కిలోల ముద్ద లేదా బొప్పాయి ఆకులు, కాకర ఆకులు, వయ్యారి భామ ఆకులు ఏవైనా5రకాల ఆకులు 2 కిలోల ముద్దను తీసుకొని మూత్రం కలపండి. ఆ తరువాత పాత్రపై మూతపెట్టి బాగా అరగంట ఉడికించండి. ఆ తరువాత పాత్రను కిందకు దింపి 48 గంటల వరకు చల్లారనివ్వండి. తర్వాత గుడ్డతో వడబోయిడి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం సిద్ధం. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2-3 లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారి చేయండి. దీనినే 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇది పెద్ద పురుగుల కు బాగా ఉపయోగపడుతుంది.
5. పశువుల పేడ మూత్రం ద్రావణం: పశువుల పేడ, మూత్ర ద్రావణం మొక్కలకు తక్షణ శక్తి నిస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితుల్లో తెగుళ్ళు మరియు పురుగుల సమస్య నుంచి బయటపడటానికి దీన్ని వాడుకోవచ్చు. ఈ ద్రావణంలో అన్న పోషకాల (నత్రజని భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాల )వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
కావలసిన పదార్థాలు: పశువుల పేడ 5 కిలోలు ,పశువుల మూత్రం 5 లీటర్లు,సున్నం 150 గ్రాములు.
తయారు చేసే విధానం: 5 కిలోల తేడా మాత్రం తీసుకుని 5లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిల్వ చేయాలి. చెట్టుపై మూత పెట్టి 4రోజుల పాటు ఆ మిశ్రమాన్ని మూరగబెట్టాలి. అలాగే ఈ మిశ్రమాన్ని రోజూ కర్రతో బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమానికి నాలుగు రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి వడబోసి 150 గ్రాముల సున్నం కలపాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలం లో ఒక సారి పిచికారి చేయాలి.
జాగ్రత్తలు: పశువుల పేడ మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది కాబట్టి ముందుగా ఒక మెష్ నుగాని , పచ్చటి గోనె సంచిని గాని వాడబోయేడానికి వాడుకోవాలి. తర్వాత దానికి మీరు కలిపి పలచన గుడ్డతో వడపోసుకొని వెంటనే ఉపయోగించుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం.
ఉపయోగాలు: ఈ ద్రావణాన్ని పిచికారి చేసే దాన్ని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంట పై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. పంట బెట్టెను వారం రోజులు వరకు తట్టుకుంటుంది. పంటలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి ఉంది. వరి పైరు లో వచ్చే అగ్గితెగులు ను సమర్ధవంతంగా నివారిస్తుంది. 100 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
Also Read: వ్యవసాయంలో గోమూత్రాన్ని శాస్త్రీయంగా ఉపయోగించేందుకు కార్యాచరణ