PJTSAU: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా సేంద్రియ వ్యవసాయంపై పది కోట్ల విలువైన ప్రత్యేక ప్రాజెక్ట్ కి అనుమతి లభించిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు ప్రకటించారు. దీనికి అవసరమైన ల్యాబ్స్
యూనివర్సిటీలో సిద్ధంగా ఉన్నాయని, స్థలం గుర్తింపు పూర్తయిందని ప్రవీణ్ రావు తెలిపారు. “స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్” ఆన్లైన్ సర్టి ఫికెట్ కోర్సు మొదటి బ్యాచ్ కి ఆన్లైన్లో సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమంలో ప్రవీణ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిజెడిఎన్ఏయు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఈ ఆన్లైన్ కోర్సుని నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 3వ తేదీ, 2021న
ప్రారంభమైన ఈ కోర్సు, జనవరి 9, 2022న ముగిసింది. వివిధ అంశాలపై మొత్తం 40 గంటల పాటు ఈ కోర్సు నిర్వహించారు. 46 మంది కోర్సుకి రిజిష్టర్ చేసుకోగా 26 మంది సర్టిఫికెట్లు పొందడానికి అర్హులయ్యారు. విద్యార్థులు, ఎంటర్ ప్రెన్యూర్స్ ఇలా వివిధ వర్గాల వారు ఈ కోర్సులో శిక్షణ పొందారు. రెండవ బ్యాచ్ కి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. శిక్షణ మార్చి 1వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కోర్సు చాలా ఉపయుక్తంగా ఉందని ప్రవీణ్ రావు అన్నారు. మహిళలు, గృహిణులు ఈ కోర్సులో పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సహిం చాలని ప్రవీణ్ రావు సూచించారు. ఈ ఏడాది నుంచి వసతులు ఉన్నచోట సేంద్రియ వ్యవ సాయంలో ఎంఎస్సీ కోర్సుని ప్రారంభించడానికి ఐసిఏఆర్ అనుమతి ఇచ్చిందని ప్రవీణ్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, డీన్ పీజి స్టడీస్ డా||అనిత, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ ఛైర్మన్ రాజ్ శీలం రెడ్డి, సీఈఓ డాక్టర్ పివిఎస్ఎం గౌరి తదితరులు పాల్గొన్నారు.