వార్తలు

Safflower Cultivation: కుసుమ సాగు యాజమాన్య పద్దతులు

0
Safflower Cultivation
Safflower Cultivation

Safflower Cultivation: తెలంగాణ రాష్ట్రంలో యసంగిలో కుసుమ సుమారు 3500-4000 హెక్టార్లలోనల్లరేగడి నేలల్లో వర్షాధారపు యాసంగి పంటగా సంగారెడ్డి , నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. 

Safflower Cultivation

Safflower Cultivation

నేలలు :నీరు నీలువని , బరువైన ,తేమను నిల్చుకొనే నల్లరేగడి,నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంటకు అనుకూలం.

Soil Farming

Soil Farming

రకాలు: TFS-1, మంజీరా, నారి-6,DSH-185

విత్తే సమయం:కుసుమ పంటను యసంగిలో OCT రెండవ పక్షం నుండి NOV మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

విత్తనం,విత్తే పద్ధతి :ఎకరానికి 4 కిలొలు (పూర్తి పంటకు), 1.5 కిలొలు (అంతర పంట),5 సెం.మీ లోతులో విత్తుకోవాలి.

Safflower Seeds

Safflower Seeds

విత్తనశుద్ది :3 గ్రా. కాప్టన్ లేదా థైరమ్ 1 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

విత్తే దూరం :వరుసల మధ్య 45 సెం.మీ,వరుసలలో మొక్కల మధ్య 20సెం.మీ దూరం లో విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :  ఎకరానికి NPK 16:10:20 , 12కిలోల గంధకం వేసుకోవాలి.

Fertilizers

Fertilizers

నీటి యాజమాన్యం :తేలిక నేలల్లో ఒకటి,రెండు నీటి తడులు ముఖ్యంగా పూతదశలో నీరు పెట్టాలి.

సస్యరక్షణ:

కాండం తొలిచే ఈగ : లార్వా కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి లోపలి బాగాన్ని తినివేయడం వలన మొక్క పై బాగం ఎండిపోతుంది . నివారణకు డైమీథోయెట్ 2.0 మీ.లి .లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Stem Fly

Stem Fly

పెను బంక : కుసుమ పంటకు పెను తాకిడి చాల ప్రమాదకరమైనది. ఆలస్యంగా విత్తిన పంట పై దిని ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తిన 40-45 రోజులకు పంటను ఆశిస్తుంది . నివారణకు డైమిథోయేట్ 2.0 మీ.లి లేదా ఎసిఫేట్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Also Read: కుసుమ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Penu Banka

Penu Banka

అల్టర్నేరియ ఆకూ మచ్చ తెగులు: ఆకుల పై గోధుమ వర్ణంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ,ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతయీ . నివారణకు మా0కో జేబ్ 2.5 గ్రా.లీటరు నీటికి, మచ్చలు కనిపించిన వెంటనే ఒకసారి 7 నుంచి 10 రోజుల వ్యవదిలో మరోసారి పిచికారి చేస్కోవాలి.

Aaku Maccha Thegulu

Aaku Maccha Thegulu

పంట కోత : రకాలను బట్టి విత్తిన 115-135 రోజులకు పంట కోతకు వస్తుంది.

కుసుమ పూతలో ఔషధ గుణలు :రక్త పోటు, చక్కెర వ్యాది , కిళ్ళనొప్పులు,మెదడులో రక్తం గద్దకట్టకుండా ,శ్వాస కొశ సంబంద సమస్యలను నివారిస్తుంది.

Also Read:  కుసుమ పంటలో ఆశించు కీటకాలు మరియు వాటి యాజమాన్యం

Leave Your Comments

Telangana Groundwater: తెలంగాణాలో భారీగా పెరిగిన భూగర్భజలాలు

Previous article

Care of Kids in Sheep Farming: గొర్రె పిల్లల సంరక్షణ -మెళకువలు

Next article

You may also like