వార్తలు

Carrot Cookies: క్యారెట్‌తో ‘‘కుకీస్‌’’ తయారుచేసే విధానం

1
Carrot
Carrot

Carrot Cookies: మనం తీసుకొనే ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు కలిగినప్పుడే రోజువారి పనులు చేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. మన శరీరానికి సరైన పోషక విలువలు అందినప్పుడే వివిధ రకాల వ్యాధులబారి నుండి మనం తప్పించుకోగలం. క్యారెట్‌ యొక్క పోషక విలువలు మరియు దాని ఔషధగుణాలు మనందరికి తెలుసు.

Carrot Cookies

Carrot Cookies

క్యారెట్‌ పంట అనేది ప్రపంచంలో బంగాళాదుంప తర్వాత రెండవ అత్యంత ప్రజాదరణ పొందినది. భారతదేశంలో క్యారెట్‌ను పండిరచే ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌. ఇది అంబెలిఫెర్‌ ఫ్యామిలికి చెందినది.

క్యారెట్‌ అధికంగా ఆల్ఫా`బీటా కెరోటిన్‌ కలిగి, విటమిన్‌`కె, విటమిన్‌`బి6 లకు మంచి మూలంగా ఉంటుంది. అందువలన దీనిని విలువ ఆధారిత (కుకీస్‌) ఉత్పత్తిగా మార్చినట్లయితే చక్కని తినే పదార్థంగా మారుతుంది. అంతే కాకుండా దీని ద్వారా స్వయం ఉపాధి కూడా పొందవచ్చు.

శక్తి 173 కె.జీ (41 కెసిఎయల్‌)
కార్బోహైడ్రేట్లు 9 గ్రా.
చక్కెరలు 5 గ్రా.
పీచు పదార్థం 3 గ్రా.
కొవ్వు 0.2 గ్రా.
ప్రొటీన్‌ 1 గ్రా.
కాల్షియం 33 మి. గ్రా.
ఇనుము 0.3 మి. గ్రా.
మెగ్నీషియం 12 మి. గ్రా.
మాంగనీస్‌ 0.143 మి. గ్రా.
ఫాస్పరస్‌ 35 మి. గ్రా.
పొటాషియం 320 మి. గ్రా.
సోడియం 69 మి. గ్రా.
జింక్‌ 0.24 మి. గ్రా.

Also Read: బ్లాక్ క్యారెట్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్‌ పిండి తయారు చేసే విధానం:
క్యారెట్లు: క్యారెట్లను వేడి నీటిలో 5 నిమిషాల పాటు 75`750 సె. వరకు ఉడికించాలి.

  • ఉడకబెట్టిన క్యారెట్‌ను ముక్కలుగా తరగాలి.
  • తరిగిన క్యారెట్‌ ముక్కలను ట్రే డ్రయర్‌ (650సె.)లో లేదా సోలార్‌ డ్రయర్‌లో 8 తేమశాతం వచ్చే వరకు ఉంచాలి.
  • ఎండిన ముక్కలను పౌడర్‌ చేసి ప్యాక్‌ చేయాలి.
Carrot

Carrot

క్యారెట్‌ కుకీలను తయారు చేయు విధానం:
క్యారెట్‌ కుకీలను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
క్యారెట్‌ పిండి – 1 కిలో
వెన్న – 500 గ్రా.లు
చక్కెర – 500 గ్రా.లు
నీరు – 180 మి. లీ.
బేకింగ్‌ పౌడర్‌ – 10 గ్రా.లు

క్యారెట్‌ కుకీలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల వివరాలు:
వెన్న: ఇది ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది మరియు లుబ్రికేట్లుగా పనిచేస్తుంది. వెన్న కుకీలను ఆకృతి మరియు నిర్మాణాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇది ఏరేటింగ్‌ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది మరియు తినే నాణ్యతను మెరుగు పరుస్తుంది.

చక్కెర: కుకీలకు తీపి రుచిని అందిస్తుంది. కుకీల ఆకృతిని గట్టిపరుస్తుంది.

నీరు: కుకీ తయారీలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నీటిని క్యారెట్‌ పిండి దశలో చేర్చి బేకింగ్‌ దశలో బయటకు తీసివేయబడుతుంది. దీనిని జోడిరచే మరియు తొలగించే సమయం మధ్య ఇది అనేక విధులను కలిగి ఉంటుంది. ఉప్పు, రసాయనాలు, చక్కెర నీటిలో కరగడం ద్వారా రంగు మరియు మంచి రుచిని అందిస్తాయి. అంతేకాకుండా పిండి అంతట మిశ్రమ పదార్థాలను సమానంగా పంపిణీ చేయడానికి ఇది సహాయపడుతుంది.
ఇది పిండి కణాలను తేమగా చేస్తూ మరియు తదుపరి ప్రక్రియకు తగిన విధంగా ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది. ఆవిరి ఏర్పడడం ద్వారా కుకీని కొంత మేరకు వాయుప్రసరణ చేయడానికి ఇది సహాయపడుతుంది.

క్యారెట్‌ కుకీల తయారుచేసే విధానం:

  • ప్లానెటరీ మిక్సర్లో వెన్న మరియు చక్కెరను బాగా కలపాలి (5 నిమిషాలు).
  • క్యారెట్‌ పిండిని జల్లెడ పట్టాలి.
  • జల్లెడ పట్టిన పిండిని మరియు బేకింగ్‌ పౌడర్‌ని ప్లానెటరీ మిక్సర్లో కలపాలి.
  • తరువాత నీటిని జోడించాలి.
  • వచ్చిన పదార్థామును కుక్కి కట్టర్‌ ఉపయోగించి షిటింగ్‌ మరియు కటింగ్‌ చేయాలి.
  • 20 నిమిషాల పాటు బేకింగ్‌ (1650సెం) చేయాలి.
  • తరువాత వచ్చిన కుకీలను చల్లార్చి ప్యాకింగ్‌ చేయాలి.

పి. శ్రీలత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫుడ్‌ టెక్నాలజి)
డా. సమ్రీన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫుడ్‌ ఇంజనీరింగ్‌)
డా.ఆర్‌. స్వామి అసోసియేట్‌ డీన్‌
ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల, రుద్రూర్‌.

Also Read: భాండ్‌గావ్‌ క్యారెట్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్

Leave Your Comments

Apple Cultivation: ఆపిల్‌ సాగులో మెలకువలు

Previous article

Nanotechnology in Agriculture: సస్యరక్షణ లో నానోటెక్నాలజీ పాత్ర

Next article

You may also like